తడి, పొడి చెత్తతో ఎరువుల తయారీ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని కంపోస్టు షెడ్‌లో ఎరువుల తయారీ కోసం మట్టి కొబ్బరి టిచ్చు, మురిగిన చెత్త, వాన పాములను (నట్టలు)లు వేయడం జరిగిందని ఎంపీడీవో తోట పర్బన్న అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపోస్ట్‌ షెడ్‌లో మురిగిన ఆకులు, కూరగాయలు, తదితర రకాల తడి పొడి చెత్త వేయడంతో 45 రోజుల తరువాత ఎరువుగా తయారవుతుందన్నారు. ఎరువుగా తయారైన తరువాత బస్తాలల్లో నింపి చెట్లకు వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీవో అబ్బాగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప, నాయకులు సందీప్‌, లింగాగౌడ్‌, కారోబార్‌ సాయిలు, తదితరులు ఉన్నారు.

Check Also

పోషకాహారంతో తల్లి, బిడ్డ క్షేమం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తుంకిపల్లి అంగన్‌ వాడి కేంద్రంలో పోషకాహార ...

Comment on the article