Breaking News

అపరిచితులు అమ్మితే కఠిన చర్యలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న విత్తనాలు ఏ డీలర్‌ వద్ద రైతు కొనుగోలు చేసాడో ఆ డీలరే ఎర్ర జొన్నలు కొనుగోలు చేయాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు.

గురువారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూరు, బాల్కొండ, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌లలో 18 మండలాలలో సుమారు 150 గ్రామాలలోని సుమారు 30 నుండి 45 వేల ఎకరాలలో ఎర్ర జొన్న సాగు చేయుట జరుగుతున్నదని, గత సంవత్సరం 30 వేల ఎకరాలలో సాగు చేయడం జరిగిందని, యాసంగి పంటగా అక్టోబర్‌, నవంబర్‌లో విత్తుకొన్న జనవరి, ఫిబ్రవరి మాసాలలో కోతకు వస్తుందని, ఈ విత్తనాన్ని పండించుటకు ఆడ, మగ విత్తనాన్ని మన జిల్లాలో 32 మంది లైసెన్స్‌ డీలర్స్‌ సరఫరా చేస్తారన్నారు.

మళ్ళీ పంట పండిన తర్వాత లైసెన్స్‌ డీలర్స్‌ కొనుగోలు చేస్తారని, ఈ కార్యక్రమాన్ని ఒక అగ్రిమెంట్‌ ద్వారా తిరిగి కొనుగోలు చేస్తారని, అటువంటి డీలర్స్‌ ద్వారానే విత్తనాలు కొనుగోలు చేయాలని, ఎవరైనా అపరిచితులు, లైసెన్స్‌లేని డీలర్స్‌ ద్వారా తీసుకోకూడదని, దీనిలో భాగంగా రేపటి నుంచి మండల వ్యవసాయ అధికారి, తాసిల్దార్‌, ఎస్‌ఐ ఎర్ర జొన్న పండించే గ్రామాలలో అవగాహన కల్పిస్తారని, ఇట్లాంటి ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారిపై మరియు అపరిచితులు ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article