Breaking News

అక్టోబర్‌ 10న క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాన్సర్‌ అవగాహన పోస్టర్‌ రిలీజ్‌ చేసిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి.

శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో క్యాన్సర్‌ అవగాహనపై పోస్టర్‌ రిలీజ్‌ చేసిన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ మరియు అపోలో హాస్పిటల్‌ వారు క్యాన్సర్‌ అవగాహన ప్రోగ్రాం అక్టోబర్‌ 10వ తేదీన నిర్వహించనున్నారని, ఫ్రీ రిజిస్ట్రేషన్‌, క్యాన్సర్‌ను దూరంగా ఉంచడం కోసం లైఫ్‌స్టైల్‌ మాడిఫికేషన్‌ కోసం ఎక్సర్సైజ్‌, మంచి ఫుడ్‌ తీసుకోవడం అందులో భాగంగా 10 అక్టోబర్‌ ఉదయం 8 గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారికి ఫ్రీ లింక్‌ ఫోన్‌ కాల్‌ ఉంటుందని, వారి సమస్యలకు నిపుణులైన డాక్టర్స్‌ సలహాలు ఇస్తారని, ఉదయం 10 గంటలనుండి 10:30 గంటల వరకు 2 కే రన్‌, 5 కే రన్‌ ఉంటుందని, ఎక్కడి వారు అక్కడే పరిగెత్తాలని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమ రాజ్‌, వైద్యులు పాల్గొన్నారు.

Check Also

స్పందించకపోవడం సరికాదు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని వివిద బీడీ కంపనీలలో బీడీలు చేసే కార్మికులతో ...

Comment on the article