Breaking News

పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రావని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. బాన్సువాడ మండలం కోనాపూర్‌లో శుక్రవారం పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పల్లె ప్రకతి వనంలో నాలుగు వేల మొక్కలు ఉండే విధంగా చూడాలని కార్యదర్శిని ఆదేశించారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని సూచించారు.

రైతు వేదిక భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని పేర్కొన్నారు. పిట్లం మండలం కుర్తి గ్రామంలో రైస్‌ మిల్లు ను పరిశీలించారు. లక్ష్యానికి అనుగుణంగా బియ్యాన్ని తయారు చేయాలని సూచించారు. డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, డిపిఓ నరేష్‌ కుమార్‌, ఆర్డిఓ రాజా గౌడ్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article