Breaking News

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయంగా చెక్కులు మంజూరు చేయించారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన రాజనర్సుకి 24 వేలు, సిరికొండ మండల కేంద్రానికి చెందిన నాగమణికి 19 వేల 500 చెక్కు అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు రక్షించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌, సిరికొండ సర్పంచ్‌ రాజారెడ్డి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article