Breaking News

కామర్స్‌ వెబినార్‌లో ప్రధానాంశాలు…

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎం. కాం (ఇ- కామర్స్‌) ఆధ్వర్యంలో ”వ్యాపార విశ్లేషణ (బిజినెస్‌ అనలటికిల్‌)” అనే అంశంపై శుక్రవారం ఉదయం అంతర్జాల సదస్సు (వెబినార్‌) నిర్వహించారు. వెబినార్‌ డైరెక్టర్‌, కామర్స్‌ విభాగపు అధ్యక్షులు, పాఠ్యప్రణాళిక చైర్మన్‌ డా.రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ కామర్స్‌ విభాగంలో మొదటి సెమిస్టర్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన వ్యాపార విశ్లేషణ అనే కోర్సుపై అవగాహన కల్పించడానికి వెబినార్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

వ్యాపార విశ్లేషణ అంటే వ్యాపార డాటాను సేకరించడం, క్రమబద్దికరించడం, ప్రాసెస్‌ చేయడం మరియు డాటాను గణాంక నమూనాలుగా మార్చడమన్నారు. ఇవన్నీ ఏ విధంగా వ్యాపారంలో ఉపయోగపడుతుందో విశ్లేషించడం జరుగుతుందన్నారు. అలాగే వ్యాపార విశ్లేషణల అవసరాలను బట్టి నాలుగు ప్రధాన రకాలైన విశ్లేషణలు ఉన్నాయన్నారు. వివరణాత్మక, విశ్లేషణాత్మక, అంచనా, సజనాత్మక వ్యాపార విశ్లేషణ వంటివి ఈ కోర్సులో అభ్యసిస్తే విద్యార్థులకు భవిష్యత్తులో కొన్ని కోర్సుల్లో మినహాయింపు ఉంటుందన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం మాట్లాడుతూ మారుతున్న ప్రపంచ మార్కేట్‌ వ్యవస్థలను అనుసరించి ఇటువంటి నూతన విషయాలను సెలబస్‌లో పరిచయం చేయడం వల్ల విద్యార్థులలో వ్యాపార, వాణిజ్య పరమైన అవగాహన కలుగుతుందన్నారు. మహాత్మాగాంధి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ మరియు పీఠాధిపతి ఆచార్య యాదగిరి వెబినార్‌లో మాట్లాడుతూ కోర్సు అభ్యసనం ద్వారా వ్యాపార ధోరణుల్లో అవగాహన ఉంటుందన్నారు.

ఈ కోర్సు వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనం ఉంటుందన్నారు. కాలానుగుణంగా మారుతున్న సాంకేతిక ప్రగతికి అనుగుణంగా కోర్సు దోహద పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన కామర్‌ అద్యాపకులు ప్రొ.ప్రశాంత ఆత్మ, ప్రొ.అప్పారావు, ప్రొ.కష్ణ కుమార్‌, ప్రొ.చెన్నప్ప వ్యాపార విశ్లేషణపై అవగాహన కలిగించారు. వెబినార్‌లో గ్లోబల్‌ లీడ్‌ వైస్‌ ప్రసిడెంట్‌ ఫిలిప్‌ వి. వరుగ్నేష్‌ మరియు మైరెన్‌ ఎడుకేషన్‌ వైస్‌ ప్రసిడెంట్‌ మిచెల్‌ వాగర్‌ మాట్లాడుతూ టెక్నాలజీ పరంగా వ్యాపార విశ్లేషణ సేకరణ ఎలా చేయాలో వివరించారు. కార్యక్రమంలో డా. శ్రీనివాస్‌, కుమారి శ్వేత, డా. గంగాధర్‌ తదితర అనుబంధ కళాశాలల కామర్స్‌ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

పిహెచ్‌డి విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. కోర్సులకు చెందిన ప్రీ పిహెచ్‌.డి. ...

Comment on the article