Breaking News

వీధి విక్రయదారులకు లోన్స్‌ ఆపొద్దు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీధి విక్రయ దారులకు బ్యాంకు లోన్స్‌పై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి.

శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మాట్లాడుతూ వీధి విక్రయదారులకు లోన్స్‌ ఆపరాదని, ప్రతి ఒక్కరికి సోమవారం వరకు సాంక్షన్‌ అయ్యేలా చూడాలని, అక్టోబర్‌ రెండవ వారం మెప్మా ద్వారా నిజామాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం ఐడెంటిఫై చేసిన 7 వేల 754 మంది, బోధన్‌లో ఐడెంటిఫై చేసిన 4 వేల 137, ఆర్మూర్‌లో ఐడెంటిఫై చేసిన 3 వేల 363, భీమ్‌గల్‌లో ఐడెంటిఫై చేసిన 774 ఉన్నారని, ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌లో ఐడెంటిఫికేషన్‌ 100 శాతం పూర్తయిందన్నారు.

నిజామాబాద్‌లో 300 మంది వీధి విక్రయదారులను ఐడెంటిఫికేషన్‌ చేయాల్సి ఉందన్నారు. బ్యాంకు నుంచి నిజామాబాద్‌లో 3 వేల 540, బోధన్‌ లో 1941, ఆర్మూర్‌లో 1292, భీమ్‌గల్‌లో 419 శాంక్షన్‌ అయినాయని, మిగతావి అప్‌లోడింగ్‌ కోసం పెండింగులో ఉన్నాయని, అప్లోడింగ్‌ తర్వాత శాంక్షన్‌ అవుతాయన్నారు. భీమ్‌గల్‌, ఆర్మూరుల్లో రేపు అప్‌లోడింగ్‌ పూర్తవుతుందని, నిజామాబాద్‌ సోమవారం పూర్తవుతుందని, కేంద్ర ప్రభుత్వం 10 నుండి 12 రోజులలో శాంక్షన్‌ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎల్డిఎం జయ సంతోషి, నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, బ్యాంక్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article