Breaking News

స్వచ్ఛ గాలి కోసమే ప్రకృతి వనాలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛమైన గాలి కోసమే పల్లె ప్రకతి వనంలను ఏర్పాటు చేయడం జరిగిందని డిఆర్డివో పీడీ చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన పల్లె ప్రకతి వనంలో మొక్కలు పరిశీలించారు. మొక్కలకు మధ్యలో ఖాళీ స్థలంలో మరి కొన్ని మొక్కలు నాటాలన్నారు. ప్రతి మొక్కకు రెండు ఫీట్ల ఒక మొక్క నాటాలని సూచించారు.

పల్లె ప్రకతి వనంలో నాటిన ప్రతి ఒక్క మొక్క సంరక్షణ పకడ్బందీగా చేయాలన్నారు. పీడీ వెంట డీపీవో నరేష్‌, ఎంపీడీవో తోట పర్బన్న, ఈసీ గణేష్‌ నాయక్‌, టిఏలు చంద్రశేఖర్‌, ప్రభాకర్‌, ఏపీవో మల్లేష్‌, పంచాయతీ కార్యదర్శి క్యసప్ప, తెల్లాపూర్‌ సర్పంచ్‌ నారాయణ, నాయకులు సందీప్‌, తదితరులు ఉన్నారు.

Check Also

వాహనదారుల ఇబ్బందులు… పట్టించుకోని అధికారులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని పెద్ద చెరువు ...

Comment on the article