కామారెడ్డి, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాలతో గ్రామీణ ప్రజలకు మానసిక ప్రశాంతత లభిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సదాశివనగర్, గాంధారి మండల కేంద్రాల్లోని పల్లె ప్రకతి వనాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. మొక్కలకు పాదులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు వీటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలితో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని చెప్పారు.
ఈనెల 27లోగా రైతు వేదిక భవనాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సదాశివనగర్, గాంధారిలోని రైతు వేదిక భవనాలను పరిశీలించారు. రైస్ మిల్లులను చూశారు. లక్ష్యానికి అనుగుణంగా బియ్యంను తయారు చేయాలని సూచించారు. సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, సదాశివనగర్, సంజీవ్, గాంధారి, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి, డిపిఓ నరేష్ కుమార్, ఆర్డిఓ శ్రీనివాస నాయక్, ఎంపీడీవోలు అశోక్, సతీష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021