నిజామాబాద్, సెప్టెంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లకు ఇరువైపుల దగ్గరగా ఉన్న పొలాల రైతులు పొలం గట్టు రోడ్డుకు దగ్గర ఉన్న గట్లపై పంటలకు సంబంధించిన గడ్డిగాని చెత్తగాని అంటించరాదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రైతు సోదరులందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు.
వానకాలం పంట కోతలకు వెళుతున్నామని, రానున్న 30 నుండి 45 రోజులలో పంట కోతకు వస్తుందని, ప్రతిసారి హరిత హారంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల మొక్కలు పెట్టడం, రోడ్డు ఆనుకొని ఉన్న పొలాలలో పంటలు పండించిన తర్వాత పంట పొలాలకు సంబంధించి కోత తర్వాత గడ్డి, వేస్టేజ్‌ను రోడ్డు ఆనుకొని ఉన్న పొలం గట్ల పైన వేసి కాల్చడం వల్ల అక్కడ రోడ్డు పక్కన పెట్టిన మొక్కలు చనిపోతున్నవని లేదా ఎండిపోయే ప్రమాదం కనబడుతుందన్నారు.
అందువల్ల రైతులందరికీ విజ్ఞప్తి ఏమంటే మొక్కల యొక్క ప్రాముఖ్యత మీకందరికీ తెలుసు కాబట్టి మీ అందరి సహకారంతో పర్యావరణానికి మేలు జరిగేలా, వర్షాలు రావడానికి ఎంతో ఉపయోగ పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మనం వ్యవసాయ పంట పూర్తయిన తర్వాత మిగిలిపోయిన గడ్డి, మిగిలిపోయిన చెత్త మీ పొలం మధ్యలో కానీ, మొక్కలకు దూరంగా ఉంచి అంటించండి లేదా కంపోస్టుగా మార్చుకుంటే ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు.
పొలంలో అంటించడం వలన భూమి సారం తగ్గే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రతి ఒక్క రైతు సహకరిస్తారని ఆశిస్తున్నాను, లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఆ వ్యక్తికి ఐదు వేల రూపాయలు పెనాల్టి వేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వేయాలని మా ఉద్దేశం కాదు కానీ మొక్కలనే కాపాడుకోవాలని, పర్యావరణం బాగుచేయాలన్న ఉద్దేశ్యం, సకాలంలో వర్షాలు రావడం వల్ల అందరం బాగు పడతారని, జిల్లా ప్రజలందరూ సహకరించాలని అలాగే రైతులకు అవగాహన కల్పించాలని గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం, హరితహారం కమిటీ సభ్యులు, సిబ్బందికి సూచిస్తూ, ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మొక్క చనిపోవద్దని మీ గ్రామ పరిధిలో చాటింపు వేయడం, ప్రజలకు రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నారు

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021