Breaking News

పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, కోవిడ్‌ సందర్భంగా చాలామంది పట్టణాలలో ఉన్నవారు గ్రామాలకు రావడం జరిగిందని, పట్టణాలలో ఉపాధి కోల్పోయి గ్రామాలకు రావడం జరిగిందని, గ్రామ సర్పంచ్‌, గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ మీ మీ గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామాలలో ప్రతిరోజు, ప్రతి ఒక్క జాబ్‌ కార్డు ఉన్న వ్యక్తికి వారంలో ఆరు రోజులు పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఏ పనులు తీసుకుంటే గ్రామానికి ఉపయోగ పడుతుందో అలాంటి పనులను మీ గ్రామ పంచాయతీ సెక్రెటరీ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ద్వారా శాంక్షన్‌ తీసుకొని వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవ్వాలని, హరితహారం, పల్లె ప్రకతి వనాలు, వ్యవసాయ పొలాలకు రోడ్లు, వ్యవసాయ కెనాల్స్‌ కొత్తవి పాతవి పూడికతీత వంటి పనులు ఆర్‌అండ్‌బి, పిఆర్‌ రోడ్డు, ఇరువైపులా బుష్‌ కటింగ్‌ చేసుకోవడం చేయాలన్నారు. ఈ అవకాశం ఉపయోగించుకుంటూ ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article