నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ ఎన్నిక అక్టోబర్ 9 వ తేదీ రోజున జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్టోబర్ 9వ తేదీ పోలింగ్, అక్టోబర్ 12 తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, శుక్రవారం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ మనకు అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల నియమావళికి లోబడి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుందని, ...
Read More »Daily Archives: September 26, 2020
రైతు ఆదాయం రెండింతలు చేసేందుకే…
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక బిల్లు పార్లమెంట్లో ఆమోదం తెలిపి చట్టరూపం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి కామారెడ్డి మండలంలోని లింగాయపల్లి గ్రామంలో పాలాభిషేకం చేశారు. మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టించి పండించిన తమ పంటకు మద్దతు ధరతో పాటు, పంటను తమకు వీలైన చోట అమ్ముకోవడానికి మార్కెట్ కూడా ఉంటుదని ప్రధానమంత్రి నరేంధ్ర మోది భరోసా ఇచ్చారన్నారు. ముఖ్యంగా రైతులను ...
Read More »నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎన్నికల నియమావళి, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల వారు ప్రచారం చేసుకోవాలి కానీ ప్రచారం చేసే క్రమంలో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరు, ఫోటో, పార్టీ పేరు ...
Read More »చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బాధితులకు పంపిణీ చేశారు. 15 మంది లబ్ది దారులకు 6 లక్షల 70 వేల 500 రూపాయల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, తెరాస కార్పొరేటర్లు, కో అప్షన్ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు.
Read More »ప్లాస్మాదానం అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డికి చెందిన 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళకు బి పాజిటివ్ ప్లాస్మా అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా తాడ్వాయి మండలం కేంద్రానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ అసోసియేట్ మేనేజర్ కాశేట్టి ఆంజనేయులు సహకారంతో బి పాజిటివ్ ప్లాస్మాను యశోద వైద్యశాలలో అందజేసి ప్రాణాలు కాపాడారు. 15 రోజుల క్రితం కూడా ఎల్లారెడ్డి చెందిన పేషెంట్‌కి కిమ్స్ వైద్యశాలలో ప్లాస్మా అందజేశారు. ఒక ...
Read More »కరోనా పరీక్షలకు కిట్లు అందుబాటులో ఉంచాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కలెక్టరేట్ జనహితలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ వైద్యులతో మాట్లాడారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో మాట్లాడిన ప్రైమరీ, సెకండరీ వ్యక్తులకు నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని వైద్యులను ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాసంలో వసతులు లేకపోతే ఆరోగ్య కేంద్రంలో క్వారంటైన్ ఏర్పాటుచేసి ఉంచాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన ...
Read More »తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 26 చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం ఉదయం బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో రామారెడ్డి మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ యూత్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇసాయిపేట నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటనికి ఆద్యులు, తెలంగాణ వీర వనిత, ఆంధ్ర మహాసభ సభ్యులు, ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని, తన సొంత భూమి ని అక్రమంగా ...
Read More »