Breaking News

కరోనా పరీక్షలకు కిట్లు అందుబాటులో ఉంచాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ వైద్యులతో మాట్లాడారు.

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో మాట్లాడిన ప్రైమరీ, సెకండరీ వ్యక్తులకు నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని వైద్యులను ఆదేశించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల నివాసంలో వసతులు లేకపోతే ఆరోగ్య కేంద్రంలో క్వారంటైన్‌ ఏర్పాటుచేసి ఉంచాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు బయట తిరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సదాశివనగర్‌, రాజంపేట, పెద్ద కొడప్గల్‌, జుక్కల్‌, పుల్కల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పాజిటివ్‌ కేసులు లేవని, వైద్య సిబ్బందిని అభినందించారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 కిట్లను కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవలందించి బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రి కాయకల్ప అవార్డును సాధించిందని చెప్పారు.

అవార్డు రావడానికి కషి చేసిన వైద్య సిబ్బందిని అభినందించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన హనుమాజీపేట, రాజంపేట, రాజీవ్‌ నగర్‌ కామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులను, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్‌, ప్రాంతీయ ఆస్పత్రి పర్యవేక్షకుడు అజయ్‌ కుమార్‌, వైద్యులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article