Breaking News

ప్లాస్మాదానం అభినందనీయం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డికి చెందిన 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళకు బి పాజిటివ్‌ ప్లాస్మా అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.

కాగా తాడ్వాయి మండలం కేంద్రానికి చెందిన యాక్సిస్‌ బ్యాంక్‌ అసోసియేట్‌ మేనేజర్‌ కాశేట్టి ఆంజనేయులు సహకారంతో బి పాజిటివ్‌ ప్లాస్మాను యశోద వైద్యశాలలో అందజేసి ప్రాణాలు కాపాడారు.

15 రోజుల క్రితం కూడా ఎల్లారెడ్డి చెందిన పేషెంట్‌కి కిమ్స్‌ వైద్యశాలలో ప్లాస్మా అందజేశారు. ఒక నెలలో రెండుసార్లు ప్లాస్మా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవసరమైన ప్లాస్మాను కూడా దాతల సహకారంతో సకాలంలో ఇప్పటివరకు 15 మందికి అందించి ప్రాణాలు కాపాడామన్నారు.

కరోనా నుంచి తిరిగి కోరుకున్నవారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కరోణ వ్యాధికి మందు లేదని ప్లాస్మా ఒకటే ప్రాణాలు కాపాడడానికి అవకాశమన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా దాతను అభినందించారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article