Breaking News

అక్టోబర్‌ 9న పోలింగ్‌, 12న లెక్కింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నిక అక్టోబర్‌ 9 వ తేదీ రోజున జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్టోబర్‌ 9వ తేదీ పోలింగ్‌, అక్టోబర్‌ 12 తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, శుక్రవారం నుంచి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ మనకు అమలులోకి వచ్చిందన్నారు.

ఎన్నికల నియమావళికి లోబడి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుందని, పొలిటికల్‌ పార్టీస్‌ కానీ, అధికారులు కానీ మోడల్‌ కోడ్‌ ప్రకారంగా కార్యక్రమాలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ కోవిడ్‌ను దష్టిలో ఉంచుకొని అదనంగా కొన్ని రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఇవ్వడం జరిగిందని, దానికి అనుగుణంగా ప్రచారం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక మాస్కు ధరించాలని, మాస్కులు లేకుండా ప్రచారం చేయరాదని, ప్రతి ఒక్కరూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని, ఎక్కడ ర్యాలీ నిర్వహించినా, సమావేశం నిర్వహించినా ముందస్తుగా చేతులు సబ్బు వాటర్‌తో కలిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సమావేశాలకు ముందుగా సమావేశానికి వచ్చే వారికి స్క్రీనింగ్‌ జరపాలన్నారు. ప్రతి మండలానికి ఎంసిసి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కాన్స్టెన్సీ లెవెల్లో స్టాటిస్టిక్స్‌, సర్వే లింగు టీం, వీడియో సర్వేలింగ్‌, ఉమ్మడి జిల్లాలకు కలిపి ఒక అకౌంటింగ్‌ టీం నియమించాలని, వీరందరూ పొలిటికల్‌ పార్టీస్‌ మోడల్‌ కోడ్‌ను తు.చ.తప్పకుండా పాటిస్తున్నారా లేదా అని పరిశీలిస్తూ, గమనిస్తూ రోజువారీగా రిపోర్టు సబ్మిట్‌ చేయడంతో పాటుగా ఎక్స్పెండిచర్‌ కూడా మానిటరింగ్‌ చేయడం జరుగుతుందన్నారు.

నిబంధనలు పాటించడానికి ప్రతి మండలంలో మెడికల్‌ ఆఫీసర్‌ను ఎన్నికల నోడల్‌ అధికారిగా నియమించడం జరిగిందని, ఆ వ్యక్తి తన పరిధిలో సమావేశాలు, ప్రచారం ఎప్పటి కప్పుడు గమనిస్తూ రిపోర్ట్‌ చేయడం జరుగుతుందని, వీటిని మానిటరింగ్‌ చేయడానికి జిల్లా స్థాయిలో నోడల్‌ అధికారి యాక్షన్‌ తీసుకొని ఐపీసీ సెక్షన్‌ ప్రకారం యాక్షన్‌ తీసుకుంటామన్నారు.

పోలింగ్‌ స్టేషన్‌లలో క్రిటికల్‌, సెన్సిటివ్‌ అనేవి గుర్తించి పోలింగ్‌ సిబ్బందిని ఐడెంటిఫికేషన్‌ చేయడం సోమవారం వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సామాగ్రి 8వ తేదీ రోజున అన్ని పోలింగ్‌ స్టేషన్లకు పంపడం జరుగుతుందని, పాలిటెక్నిక్‌ కాలేజ్‌ నుండి డిస్ట్రిబ్యూషన్‌ చేస్తామన్నారు. సిబ్బంది, మెటీరియల్‌, రూట్‌, బందోబస్తు ప్లాన్‌ చేసుకోవడం కోసం సూచనలు ఇచ్చామని, మంగళవారం సాయంత్రం వరకు రిపోర్టు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్లు చంద్రశేఖర్‌, లత పాల్గొన్నారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article