Breaking News

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 26 చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం ఉదయం బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో రామారెడ్డి మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా బీసీ యూత్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఇసాయిపేట నరేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటనికి ఆద్యులు, తెలంగాణ వీర వనిత, ఆంధ్ర మహాసభ సభ్యులు, ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని, తన సొంత భూమి ని అక్రమంగా ఆక్రమించి, తన కూతుర్ని చంపిన విసునూరు దేశ్‌ముఖ్‌, రజాకార్ల మీద, భూస్వాములపై తిరగబడి పోరాటం చేసిన ధీశాలి అని కొనియాడారు. భూ పోరాటంలో భాగంగా జరిగిన కోర్టు కేసులలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ 200 కిలోమీటర్ల సైకిల్‌ మీద ప్రయాణించి కోర్టులో వాదనలు వినిపించారని, వారి సహకారంతో తీర్పు ఐలమ్మకు అనుకూలంగా వచ్చిందన్నారు.

ఐలమ్మ భూ పోరాటం విజయంతో 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఈ పోరాటంలో 4 వేలకు పైగా ఉత్పత్తి కులాల (బీసీ కులాల) ప్రజలు అమరులయ్యారని తెలిపారు. కార్యక్రమంలో రామారెడ్డి టౌన్‌ ప్రెసిడెంట్‌ ఉసికే రాజు, మండల అధ్యక్షులు సౌడం నవీన్‌, ఉపాధ్యక్షులు శెట్పల్లి భైరయ్య, నోముల రాజ్‌ కుమార్‌, బండి ప్రవీణ్‌, గడ్డం ప్రసాద్‌, కందుల ప్రశాంత్‌, వున్నోసిపేట్‌ అశోక్‌, రెడ్దపేట్‌ సాయిరాం గౌడ్‌, లింబాద్రి, మంగలి రామస్వామి, మంగలి రవి, మంగలి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article