Breaking News

నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎన్నికల నియమావళి, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీల వారు ప్రచారం చేసుకోవాలి కానీ ప్రచారం చేసే క్రమంలో కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలన్నారు.

బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేరు, ఫోటో, పార్టీ పేరు ఉంటుందని, పార్టీ సింబల్‌ ఉండదన్నారు. ఓటరుకు అంకెలు మాత్రమే వేయాలని, పేర్లు రాయడం, టిక్కులు చేయడం చేయరాదన్నారు. ఈ విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించాలని, మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారని, ప్రచారం చేసే క్రమంలో కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, ఏ సమస్య ఉన్నా తమ దష్టికి తేవాలన్నారు. పుకార్లకు తావివ్వవద్దని, ఏ టైం అయినా డిస్కస్‌ చేయుటకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

అపోహలతో వెళ్లొద్దు అని, ఎక్కడ ఏది చేసినా రూల్స్‌ ప్రకారమే చేస్తామన్నారు. మోడల్‌ కోడ్‌ వైలెట్‌ చేసి వాట్సాప్‌ లలో పెడితే ఎంసిసి నోడల్‌ అధికారి డిఈఓకు కంప్లైంట్‌ చేస్తే యాక్షన్‌ తీసుకుంటామన్నారు. కంప్లైంట్‌ వచ్చినా ఎంక్వయిరీ చేస్తామని, నిజమని తేలితే వెంటనే కేసు పెడతామని, సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ని పర్యవేక్షించడానికి నిజామాబాద్‌ సిపి ఆఫీసు, కామారెడ్డి ఎస్పీ ఆఫీస్‌లో కలెక్టరేట్‌ ఎంసిసిలో సెల్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

మోడల్‌ కోడ్‌ వైలెట్‌ ఎవరు చేసినా కేసు పెడతామన్నారు. ఇంటింటా ప్రచారంలో కాండిడేట్‌ తో పాటు ఐదుగురు మాత్రమే ఉండాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, చేతులు శానిటైజర్‌ లేదా సోప్‌ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలన్నారు. సమావేశాలు నిర్వహిస్తే 100 మంది మించకుండా నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిసిఓ సింహాచలం, ఏవో సుదర్శన్‌, ఆల్‌ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

Comment on the article