Breaking News

రైతు ఆదాయం రెండింతలు చేసేందుకే…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక బిల్లు పార్లమెంట్లో ఆమోదం తెలిపి చట్టరూపం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి కామారెడ్డి మండలంలోని లింగాయపల్లి గ్రామంలో పాలాభిషేకం చేశారు.

మండల ప్రధాన కార్యదర్శి నవీన్‌ గౌడ్‌ మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టించి పండించిన తమ పంటకు మద్దతు ధరతో పాటు, పంటను తమకు వీలైన చోట అమ్ముకోవడానికి మార్కెట్‌ కూడా ఉంటుదని ప్రధానమంత్రి నరేంధ్ర మోది భరోసా ఇచ్చారన్నారు.

ముఖ్యంగా రైతులను మధ్య వర్తిత్వంతో మోసం చేస్తున్న దళారి వ్యవస్థను రూపుమాపి మన రైతుల ఆదాయం రెండింతలు చేసేందుకు అహరహం పనిచేస్తున్న మోదిపై పూర్తి నమ్మకం ఉంచండని, మోది ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో బొమ్మల రాజు, రాజశేఖర్‌, తోట శ్రావణ్‌, అంజల్‌ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article