Breaking News

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వీరుడు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆదివారం రామారెడ్డి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ, యువజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో రామారెడ్డిలో బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరిపారు.

ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇసాయిపేట నరేష్‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మొట్ట మొదటి వీరుడు అని, తెలంగాణ కోసమే నిజాయితీగా కషి చేసి తన మంత్రి పదవికీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, రెండు సార్లు సీఎం అయ్యే అవకాశాలు వచ్చినప్పటికీ బడుగుల కోసం పోరాడి సీఎం పదవిని సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన తెలంగాణ అమరవీరులు అని తెలిపారు.

సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రామారెడ్డి మండల అధ్యక్షులు సౌడం నవీన్‌, ఉపాధ్యక్షులు శేట్పల్లి భైరయ్య, నోముల రాజ్‌ కుమార్‌, అశోక్‌, శ్రీకర్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article