Breaking News

ధైర్యంగా ఉద్యమించిన నాయకుడు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. ఆదివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వయం సహాయక, సహకార ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి, చేతి వత్తులు, వ్యవసాయ ఆధారిత వత్తులు, సబ్సిడీలు, వత్తుల అభివద్ధి, ఆధునీకరణ కొరకు కషి చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు ధైర్యంగా ఉద్యమించిన నాయకుడు, హరిజనొద్దరణకు ముందున్న మరియు పటేల్‌, పట్వారీ దోపిడీ వ్యవస్థకు ఎదురొడ్డిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఒక ఆదర్శవంతమైన నాయకుడని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ లత, జిల్లా బిసి అభివద్ధి శాఖ అధికారి రమేష్‌, డిడబ్ల్యుఓ సంధ్యారాణి, డిపిఓ జయసుధ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్పందించకపోవడం సరికాదు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని వివిద బీడీ కంపనీలలో బీడీలు చేసే కార్మికులతో ...

Comment on the article