Breaking News

తెరాసలోకి కాంగ్రెస్‌ జడ్పిటిసి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ జడ్పీటీసీ కె.ఉషాగౌడ్‌ ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో ఆదివారం టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్‌లో చేరినట్లు జడ్పీటీసీ ఉషాగౌడ్‌ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనరంజక పాలన, రైతులకు, పేదలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఎల్లారెడ్డి జడ్పీటిసి కల్లాల ఉషాగౌడ్‌ స్థానిక శాసనసభ్యులు జాజుల సురేందర్‌ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారన్నారు.

పార్టీ బలోపేతానికి కషి చేస్తానని వారు హామీ ఇచ్చారని, వారిని వారి కార్యకర్తలను టిఆర్‌ఎస్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఎల్లారెడ్డి అభివద్ధి కోసం ఏదైతే నమ్మకంతో వచ్చారో కచ్చితంగా వారి నమ్మకాన్ని గౌరవిస్తామని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి ఎల్లారెడ్డి అభివృద్ధి కోసం జిల్లా మంత్రిగా తప్పకుండా కషి చేస్తానని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article