Breaking News

తెరాసలోకి 37వ డివిజన్‌ కార్పొరేటర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌కు చెందిన బీజేపీ 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆదివారం తెరాస కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమారాణి, ముత్యాలు తెరాస పార్టీలో చేరారు.

వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌ రెడ్డి ఉన్నారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article