Breaking News

ఎన్నికల నోడల్‌ అధికారులు వీరే…

కామరెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలలో భాగంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎన్నికల నోడల్‌ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశాలు జారీ చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ జిల్లా సెక్యూరిటీ ప్లాన్‌ నోడల్‌ అధికారిగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌. శ్వేత నియమింపబడ్డారు.

మ్యాన్‌ పవర్‌ మేనేజ్మెంట్‌, పోలింగ్‌ సిబ్బంది మైక్రో అబ్జర్వర్లు మొదలగు వాటికి నోడల్‌ అధికారిగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్‌, బ్యాలెట్‌ పేపర్‌, డమ్మీ బ్యాలెట్‌ పేపర్‌ నోడల్‌ అధికారిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సింగి రెడ్డి, ట్రాన్స్‌పోర్టు మేనేజ్మెంట్‌ నోడల్‌ అధికారిగా జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి వాణి, మెటీరియల్‌ మేనేజ్మెంట్‌ నోడల్‌ అధికారిగా జిల్లా గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి శ్రీనివాస్‌ బాబు, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నోడల్‌ అధికారిగా, ట్రైనింగ్‌ మేనేజ్మెంట్‌ నోడల్‌ అధికారిగా జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, ఎక్స్పెండిచర్‌ మానిటరింగ్‌ నోడల్‌ అధికారిగా జిల్లా ఆడిట్‌ అధికారి విజయలక్ష్మి, అబ్జర్వర్స్‌ నోడల్‌ అధికారిగా జిల్లా కో ఆపరేటివ్‌ అధికారి శ్రీనివాస్‌, మీడియా నోడల్‌ అధికారిగా జిల్లా పౌరసంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇల్లిసిట్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫ్‌ లీటర్‌ నోడల్‌ అధికారిగా జిల్లా ఎక్సైజ్‌ అధికారి శ్రీనివాస్‌, కంప్యూటరైజేషన్‌ నోడల్‌ అధికారిగా ఎన్‌ఐసి జిల్లా ఇన్ఫర్మేషన్‌ అధికారి బి.రవి, హెల్ప్‌ లైన్‌, కంప్లైంట్స్‌ రిడ్రెసల్‌ నోడల్‌ అధికారిగా ఐటీ ఇంజనీర్‌ నరేందర్‌, ఎస్‌ఎంఎస్‌ మానిటరింగ్‌, కమ్యూనికేషన్‌ ప్లాన్‌ నోడల్‌ అధికారిగా ఇ-జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌లను నియమించినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article