Breaking News

దోపిడీ వ్యవస్థ నిర్మూలనతోనే కులాల నిర్మూలన

రెంజల్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో సాంఘిక సమానత్వానికై అనేక పోరాటాలు జరిగాయని కాని పాలకులు కులాల నిర్మూలనకు అడ్డుపడుతూ దేశ అభివద్దికి అడ్డు పడుతున్నారని బి.మల్లేష్‌, డి.రాజేశ్వర్‌ అన్నారు. రెంజల్‌ మండలం బోర్గాం గ్రామంలో సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కుల నిర్మూలన సభలో బి.మల్లేష్‌, డి.రాజేశ్వర్‌ మాట్లాడారు.

న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాత్మా జ్యోతి రావ్‌ పూలే సత్య శోధక్‌ సమాజ్‌ సందర్భంగా సెప్టెంబర్‌ 24 నుండి 30 వరకు వారం రోజుల పాటు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడుతామని వివరించారు.

దేశంలో తరతరాలు మనువాద బ్రాహ్మణీయ భావజాలం నిచ్చెన మెట్ల కులవ్యవస్థ క్రింది కులాల పైన, మహిళల పైన జరుగుతున్న వివక్షతకు, దాష్టీకానికి వ్యతిరేకంగా ఎంతో మంది పొరాడినారని, అయినా కులాల నిర్మూలన జరగలేదని, దీనికి ఈ దోపీడీ వ్యవస్థ నిర్మూలనతో కులాల నిర్మూలన సాధ్యమౌతుందని తెలిపారు. కార్యక్రమంలో గుమ్ముల గంగాధర్‌, పుట్టి నాగన్న, ఒడ్డెన్న, షేక్‌ నసీర్‌, పీ.రాజేశ్వర్‌, పెద్దులు, ఎల్‌.గంగాధర్‌, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Comment on the article