చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల హెడ్స్‌ లూస్‌ 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సబ్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు చిరుత సంచరించడం పట్ల భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు.

ప్రతినిత్యం జీవాలను జీవలదారులు మేపేందుకు తీసుకుని వెళుతుంటారు, చిరుతపులి సంచరించడం పట్ల జీవలదారులు సైతం భయాందోళనలకు చెందుతూ జీవాలను మేపుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత సంచరించకుండా రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా ఆదివారం తెల్లవారుజామున కుక్కను తిన్న చిరుత సమాచారాన్ని తెలుసుకున్న అటవీశాఖాధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు గుర్తించారు.

Check Also

పోషకాహారంతో తల్లి, బిడ్డ క్షేమం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తుంకిపల్లి అంగన్‌ వాడి కేంద్రంలో పోషకాహార ...

Comment on the article