నిజాంసాగర్‌లో 1396.64 అడుగుల నీటి మట్టం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులకు గాను 1396.64 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను 8.135 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు 6914 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్ల గాను, 522.425 మీటర్ల నీటి మట్టం, అలాగే 29.917 టీఎంసీలకు గాను 23.705 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో 9286 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

Check Also

పోషకాహారంతో తల్లి, బిడ్డ క్షేమం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తుంకిపల్లి అంగన్‌ వాడి కేంద్రంలో పోషకాహార ...

Comment on the article