నిజామాబాద్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా లోకల్ అథారిటీ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్, కోఆపరేటివ్ శాఖ కమిషనర్ మరియు రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య పరిశీలించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు ఇచ్చారు.
పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో టెంటు, డయాస్, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌కు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడి నుంచేనని, పాలిటెక్నిక్ కళాశాలలో వచ్చే సోమవారం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్డివోను ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ బూతును, బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించారు.
ఓటు వినియోగించుకోవడానికి వచ్చినవారికి జడ్పీ సమావేశ మందిరం వెయిటింగ్ హాల్‌గా ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం, నిజామాబాద్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్‌ను పరిశీలించారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేటర్లు ఓటింగ్ వినియోగించుకోనున్నారని, మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపిటిసిలు ఓటింగ్ వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికల పరిశీలకుల వెంట అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్టీవో రవి, ఏసీపీ శ్రీనివాస్, డిసిపి ఉషా విశ్వనాధ్, జడ్పీ సీఈవో గోవింద్, ఎంపీడీవో సంజయ్, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులు ఉన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021
- రుద్రూర్లో శాంతి కమిటీ సమావేశం - April 14, 2021
- కోటగిరిలో కోవిడ్ నిబంధనలపై అవగాహన - April 14, 2021