ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకతి వనాలలో మరిన్ని మొక్కలను ఉద్యమంలా నాటాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ కుమార్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం ఆరేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల పల్లె ప్రకతి వనంలో మొక్కలు పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రకతి వనంలో ఎక్కువ మొక్కలు నాటాలని, నాటిన ప్రతి ఒక్క మొక్క సంరక్షణ పకడ్బందీగా చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కలెక్టర్‌ వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంతు కేశవ్‌ పాటిల్‌, ఎంపీడీవో తోట పర్బన్నా, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఈసీ గణేష్‌ నాయక్‌, నాయకులు యటకారి నారాయణ, తదితరులు ఉన్నారు.

Check Also

పోషకాహారంతో తల్లి, బిడ్డ క్షేమం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తుంకిపల్లి అంగన్‌ వాడి కేంద్రంలో పోషకాహార ...

Comment on the article