Breaking News

పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ ఐపిఎస్‌ కార్తికేయ సమాచారం మేరకు నిజామాబాద్‌ పోలీసులు ఒరిస్సాకు చెందిన ఒక కార్‌, ఒక మహేంద్ర బొలెరో ట్రక్కులో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

35 ప్యాకెట్లలో సుమారు 15 లక్షల నుండి 16 లక్షల విలువ గల 152 కిలోల గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి 9 సెల్‌పోన్లు, 1000 రూపాయల నగదు, హుందాయ్‌ ఐ 20 కార్‌, బి.నెం. ఓడి 10 జె 7131 మరియు మహేంద్ర బొలెరో మ్యాక్సీ ట్రక్‌ బి.నెం. ఓ.డి. 30 బి 8042 లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నేరస్థులను కోర్టులో హాజరు పరచినట్టు 4వ టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article