మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం రాయితీపై సమీకత మత్స్య అభివద్ధి పథకం ద్వారా చేప పిల్లలు పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో మంగళవారం ఆయన చేప పిల్లలు వదిలే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వలలు, వాహనాలు ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేసిందని పేర్కొన్నారు.

ప్రాజెక్టులో 48 లక్షలు చేప పిల్లలు వేయాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. రొయ్య పిల్లలను ప్రాజెక్టులో వేయాలని సూచించారు. నిజాంసాగర్‌ మండలం ఆరేపల్లిలో పల్లె ప్రకతి వనం పరిశీలించారు. మొక్కలు దగ్గర దగ్గరగా నాటాలని, పాదులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జిల్లా మత్స్య శాఖ అధికారిని పూర్ణిమ, అధికారులు, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

పోషకాహారంతో తల్లి, బిడ్డ క్షేమం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని తుంకిపల్లి అంగన్‌ వాడి కేంద్రంలో పోషకాహార ...

Comment on the article