నిజాంసాగర్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు పదహారు రోజులుగా అలుగు పొంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఎల్లారెడ్డి- మెదక్ ప్రధాన రహదారిపైనుంచి నీరు పారడంతో రోడ్డు గుంతలమయమైంది. రహదారి గుండా వాహనదారులు అలుగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుంతలో పడి వాహనదారులకు గాయాలైన సంఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. రాత్రి వేళల్లో రహదారి గుండా రావడానికి వాహనదారులు జంకుతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చెరువు కట్టపై గల రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కోవిడ్ టీకా కేంద్రాన్ని ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే - January 19, 2021
- నిధుల సద్వినియోగం, సకాలంలో పనులు – ఎంపి ధర్మపురి అర్వింద్ - January 19, 2021
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021