Breaking News

Monthly Archives: October 2020

ఇందిరా గాంధీకి ఘన నివాళి

బీర్కూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం దివంగత నేత ఇందిరాగాంధీ 36వ వర్థంతి సందర్భంగా బీర్కూర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌, మండల కాంగ్రెస్‌ అధ్రక్షులు పోగు నారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఇందిర చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1966-1977 వరకు మళ్ళీ 1980 లో నుంచి 1984 లో ఆమె కన్నుమూసేంత వరకు దేశ ప్రధాన మంత్రిగా పని ...

Read More »

చెత్తను సంపద కేంద్రానికి తరలించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడవలసిన బాధ్యత సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి పై ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రకతి వనాల్లో నాటిన మొక్కలు వంద శాతం సంరక్షణ చేసే విధంగా చూడాలన్నారు. రోడ్‌ సైడ్‌ అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు సంరక్షణ చేయాలని కోరారు. కంపోస్టు షెడ్లను వినియోగించుకోవాలని సూచించారు. ...

Read More »

చలికాలంలో వ్యాప్తిచెందే వ్యాధులపై అవగాహన

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు చలికాలంలో వ్యాప్తి చెందే వ్యాధులకు తోడు ప్రస్తుతం కరోనాను నివారణ, నియంత్రణ గురించి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు, వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో పాటించాలని డిఎం హెచ్‌వో తెలిపారు. కామారెడ్డి జిల్లాలో అంటువ్యాధులు మరియు కోవిడ్‌ 19ను పూర్తిస్థాయిలోవ్యాప్తిని అరికట్టేందుకు విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. వైద్యుల సూచనలు, వ్యక్తిగత, ...

Read More »

ఘనంగా మహనీయుల జయంతి వేడుకలు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం మహర్షి వాల్మీకి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ మాట్లాడుతూ ఇద్దరు మహనీయుల జయంతి వేడుకలు ఒకే రోజు జరగడం గర్వంగా ఉందన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారతదేశ తొలి ప్రధాని, 530 సంస్థానాలను దేశంలో విలీనం చేసి ఉక్కుమనిషిగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ...

Read More »

రూ.1850 క్వింటాల్‌ ధర

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు సమగ్ర సర్వేలో మొక్క జొన్నలు సాగుచేసిన రైతుల నుంచి కొనుగోలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బిక్కనూర్‌ మండల కేంద్రంలో శనివారం ఆయన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రైతులనుద్దేశించి మాట్లాడారు. దళారుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.1850 క్వింటాల్‌ ధర నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాలో 33 వేల ఎకరాలలో ఈ ఏడాది మొక్కజొన్న పంటను ...

Read More »

గురుకుల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నవంబరు 1న నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 48 వేల సీట్లకు 1.48 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా దగ్గర్లోనే పరీక్ష కేంద్రాలను గురుకుల సొసైటీలు గుర్తించాయి. విద్యార్థి సెట్‌ దరఖాస్తులో పేర్కొన్న చిరునామా మేరకు సంబంధిత మండలంలో కేంద్రం కేటాయించాయి. ఒక్కో తరగతి గదిలో 20 ...

Read More »

రైతులు అధైర్య పడొద్దు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివవారం కామారెడ్డి జిల్లా, ఎస్‌ఎస్‌ నగర్‌ మండలంలోని, అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఆదనపు కలెక్టర్‌ యాది రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ రైతుల కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు రైతుల కోసం రైతు బంధు కానీ రైతు ...

Read More »

ధైర్యశాలి.. ఉక్కు మనిషి…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాది పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్‌ జిల్లా కోర్టు ఆవరణలో మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 145వ జన్మదినోత్సవం సందర్భంగా ఏక్తా దివస్‌గా పాటిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి న్యాయవాదులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ సర్దార్‌ పటేల్‌ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, జాతీయవాది, ధైర్యశాలి, ఉక్కు మనిషిగా పేర్కొన్నారు. పటేల్‌ 1875 లో గుజరాత్‌లో ...

Read More »

స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు కొత్తగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్లాట్‌ బుక్‌ చేసుకోవాలనుకునే వారు మీసేవ కేంద్రాలలో వివరాలను నమోదు చేయించుకోవాలని, నవంబర్‌ 2వ తేదీ నుండి అన్ని తహసిల్దార్‌ మరియు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, జిల్లా ప్రజలు అవకాశాలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ ప్రకటనలో కోరారు.

Read More »

9 నుంచి పిజి పరీక్షలు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధింపబడి ఒక సందిగ్ధావస్థ నెలకొని, నేటికి కొంత తేరుకొని ఎట్టకేలకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ కోర్సులకు పరీక్షలు జరుగనున్నాయి. పీజీ కోర్సులకు చెందిన థియరీ పరీక్షలు నవంబర్‌ 9 నుంచి 23 వ తేదీ వరకు ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్డ్‌ విడుదల చేశారు. పీజీ కోర్సులకు చెందిన ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ. నాల్గవ సెమిస్టర్‌ ...

Read More »

మానవ సంబంధాలు హదయ బాంధవ్యాలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ సంబంధాలు హదయ బాంధవ్యాలని రామాయణ మహా కావ్యం ద్వారా ఆదికవి వాల్మీకి చాటి చెప్పారని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్‌ అన్నారు. శనివారం సాయంత్రం శరత్‌ పౌర్ణమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చదువదగిన మహా కావ్యం రామాయణం అని, రామాయణ పఠనం మనిషి జీవితాన్ని మార్చి వేయగలదని, కరుణ మానవత్వం మానవ హదయాలలో నిక్షిప్తం ...

Read More »

కడ్తా తీస్తే మిల్లర్లపై చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తర్వాత వ్యవసాయ అధికారులు దాన్ని పరిశీలించి నాణ్యతను ధవీకరిస్తారని అందువల్ల రైస్‌ మిల్లులు అదనంగా కడ్తా పేరుతో తగ్గిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన మాక్లూర్‌ మండలం డీకంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చాలా స్పీడ్‌గా జరుగుతున్నదని, శుక్రవారం ...

Read More »

డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించిన మేయర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నగరంలోని 25వ డివిజన్‌ కోటగల్లి మైసమ్మ గుడి వద్ద సుమారు 10లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్‌ సిరిగారి ధర్మపురితో కలిసి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ ప్రారంభించారు. అభివద్ధి కార్యక్రమాల గురించి నగర మేయర్‌ మాట్లాడుతూ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్త ప్రోత్సాహంతో నగరంలో శరవేగంగా అభివద్ధి పనులు జరుగుతున్నాయని, నగర సుందరీకరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ...

Read More »

బంజారాల ఆరాధ్య దైవం రామ్‌ రావ్‌ మహరాజ్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ తపస్వి పౌరా దేవి పీఠాధిపతి రామ్‌ రావు మహరాజ్‌ మతి పట్ల ఉమ్మడి జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాన్సువాడ పట్టణ కేంద్రం, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బంజారా సోదరులు ఏర్పాటు చేసిన పీఠాధిపతి సంత్‌ రామ్‌ రావు చిత్రపటానికి పులమాల సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బంజారాలు పాల్గొన్నారు.

Read More »

స్ఫూర్తి ప్రదాతల అడుగుజాడల్లో నడవడమే గొప్ప నివాళి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాల్మీకి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ లాంటి స్ఫూర్తిప్రదాతల అడుగు జాడల్లో నడవడమే మనం వారికి అర్పించే గొప్ప నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. మహర్షి వాల్మీకి, ఉక్కు మనిషి భారతరత్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిలను పురస్కరించుకొని శనివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాటసారులను ...

Read More »

ప్లాస్మాదానం.. ప్రాణదానం….

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కరోనా పేషెంట్‌కి బి పాజిటివ్‌ ప్లాస్మా కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన వ్యాపారి జలిగామ చంద్రశేఖర్‌ మానవత దక్పథంతో బి పాజిటివ్‌ ప్లాస్మాను సన్‌ షైన్‌ వైద్యశాల హైదరాబాదులో అందజేసి ప్రాణాలు కాపాడడం అభినందనీయమని బాలు అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా కావాలంటే 9492874006 కు సంప్రదించాలని, వారికి దాతల సహకారంతో ...

Read More »

ఒక్క కిలో కూడా తరుగు రావద్దు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మండలం కాలూర్‌ గ్రామంలో సిద్దిరామేశ్వర్‌ రైస్‌మిల్‌ను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ మండలం కాలూర్‌ గ్రామంలో సిద్ది రామేశ్వర్‌ రైస్‌ మిల్‌లో ధాన్యం సేకరణ, కస్టమర్‌ మిల్లింగ్‌ ప్రక్రియ పరిశీలించారు. రైస్‌ మిల్‌ ప్రక్కన కోత కోస్తున్న హర్వేస్టర్‌, కోసిన ధాన్యం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడారు. అనంతరం హార్వెస్టర్‌ యజమానులతో మాట్లాడారు. వానాకాలం ధాన్యం సేకరణలో 9 లక్షల టన్నుల ...

Read More »

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పలు అభివద్ది పనులకు శుక్రవారం శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. బీబీపేట్‌ మండలంలో 2.95 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని, జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో దాత తిమ్మన్నగారి సుభాష్‌ రెడ్డి స్వంత నిధులు సుమారు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ...

Read More »

కరోనా వ్యాప్తి చెందే అవకాశముంది…

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. కామరెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చలికాలంలో, పండగల సందర్భంగా అధికంగా ఉండే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు ...

Read More »

మొక్కజొన్న మద్దతు ధర రూ.1850

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో వానకాలం 2020 మొక్కజొన్న పంటకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1850 నిర్ణయించి కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వ్యవసాయ, రెవిన్యూ అధికారులతో మాట్లాడుతూ మొక్కజొన్న సాగు చేసిన రైతుల వివరాలను రైతు సమగ్ర సమాచార సేకరణ పోర్టల్‌లో నమోదు చేయడం జరిగినందున, పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతులను వ్యవసాయ విస్తరణ అధికారులు, ...

Read More »