హైదరాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదని, పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు గోదావరి, కష్ణా ...
Read More »Daily Archives: October 1, 2020
ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి నారాయణ రెడ్డి పరిశీలించారు. గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మెటీరియల్, బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ తదితర ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఏవో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Read More »అధికారులకు సమాచారం తెలపాలి
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పురపాలక సంఘ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులకు ఫోన్ ద్వారా కమీషనర్ యం.సిపల్ సమాచారం అందించారు. గురువారం ఉదయం ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశానుసారంగా కామారెడ్డి పట్టణంలో గల ఇంటి యజమానులకు వ్యవసాయేతర భూములు మరియు ఆస్తి యొక్క వివరాలు ఇంటింటికి వచ్చు అధికారులకు సమాచారాన్ని తెలియపరచవలసిందిగా కౌన్సిల్ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు. కార్యక్రమంలో ఆర్.ఐ జానయ్య, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »ప్రముఖ వైద్యుడు తాటికొండ భైరయ్య మృతి
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ తాటికొండ బైరయ్య మతిపట్ల మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ ఆలీ షబ్బీర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. డాక్టర్ బైరయ్య ఇక లేరన్నవార్త కలచివేసిందని, ఆయన తమ కుటుంబ డాక్టర్ అని అతని వద్ద వైద్యం చేయించుకున్న వారు చుట్టుపక్కల పట్టణాల్లో నివసించినా తిరిగి అతని వద్దకు వచ్చి వైద్యం చేయించుకునే వారని గుర్తుచేశారు. ఆయన డబ్బు ...
Read More »వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్లో గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం సంతకాల సేకరణ చేస్తామని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని కోరారు. బడా కంపనీలతో ప్రధాని మోడీ కుమ్ముక్కయ్యారని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు ...
Read More »మీరిచ్చే రక్తదానం…మరొకరికి ప్రాణదానం
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్క యువతీ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ప్రస్తుత తరుణంలో బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు లేకపోవడం వలన ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం దొరకడం లేదని మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చునని ...
Read More »అక్టోబర్ 5 నుంచి ప్రాక్టీకల్స్… 12 నుంచి థియరీ ఎగ్జామ్స్
డిచ్పల్లి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్. అండ్ ఎం.ఎడ్. కళాశాలలో కొవిద్ – 19 మార్గనిర్దేశాలను అనుసరించి ఈ నెల 12 వ తేదీ నుంచి బి.ఎడ్. చివరి (నాల్గవ) సెమిస్టర్ రెగ్యూలర్ మరియు బ్యాక్ లాగ్ పరీక్షలు మరియు ఎం.ఎడ్. మూడవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్, ఇంఫ్రూవ్ మెంట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే షెడ్యూల్డులో బి.ఎడ్. మొదటి, రెండవ, ...
Read More »