బీర్కూర్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీ నుండి మంజీర నది వంతెన వరకు నిర్మించిన రోడ్లు నాసిరకంగా ఉండడం వల్ల రోడ్ల పైన పగుళ్ళు కనబడుతున్నాయి. దానికి తోడు మంజీర నది పరివాహక ప్రాంతంలో తెలంగాణ మైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక టెండర్ల ద్వారా అధిక లోడ్‌తో లారీలు ప్రయాణించడం వల్ల నాసిరకం రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని పోచారం కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అధిక లోడ్‌తో ...
Read More »Daily Archives: October 4, 2020
గర్భిణీలకు రక్తదానం చేసిన యువకులు
కామారెడ్డి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల బ్లడ్ బ్యాంకులో ఆదివారం శ్రమశక్తి రాష్ట్ర అధ్యక్షుడు వరద శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. గర్భిణీలకు కావాల్సిన రక్తనిల్వలు లేకపోవడంతో వారి ఇబ్బందులను తెలుసుకొని రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతలను, చొరవ చూపిన శ్రమశక్తి రాష్ట్ర అధ్యక్షుడు వరద శ్రీనివాస్‌ను అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ...
Read More »పుస్తక పరిచయం
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్, కవి దండి వెంకట్ రచించిన అసుర పునర్ణవం పుస్తక పరిచయ కార్యక్రమం ఆదివారం నిజామాబాదు వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగింది. ప్రముఖ కవి, రచయిత బి.నాగభూషణం వక్తగా హాజరై పుస్తక పరిచయం చేశారు. పిడిఎస్యు రాష్ట్ర మాజీ అద్యక్షులు పాకాల నర్సింలు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రచయిత దండి వెంకట్‌తో పాటు ప్రజాసంఘాల నేతలు రత్నయ్య, శ్రీధర్, విజయలక్ష్మి, మాణిక్యం, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Read More »మద్దతు ధర ఏదీ?
బోధన్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ముగియడంతో రైతాంగం సాగు చేసిన వరి ధాన్యాన్ని నూర్పిడి చేయడం ప్రారంభించారని, అయితే కేంద్రం ప్రకటించిన రూ. 1888 లు మద్దతు ధర మాత్రం లభించక పోవడంతో తక్కువ ధరకే బయట ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారని, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ఏక్కడా? అని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి మల్లేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం ఉదయం ఊట్పల్లి గ్రామంలో రైతులతో ...
Read More »రెండు గంటలలో మూడు చోరీలు…
వర్ని, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని మరియు గోవూరు గ్రామాలలో రెండు గంటలలో మూడు చోరీలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు వర్ని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోధన్ ఏసిపి రామారావు వెల్లడించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన సాయికుమార్ అనే వ్యక్తి వర్ని మండల కేంద్రంలో రెండు ఇళ్లలో, గోవూరులో ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. దొంగతనాలు జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ...
Read More »