వర్ని, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని మరియు గోవూరు గ్రామాలలో రెండు గంటలలో మూడు చోరీలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు వర్ని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోధన్ ఏసిపి రామారావు వెల్లడించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన సాయికుమార్ అనే వ్యక్తి వర్ని మండల కేంద్రంలో రెండు ఇళ్లలో, గోవూరులో ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డాడని తెలిపారు.
దొంగతనాలు జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నేరస్తుడిని పట్టుకొని, దొంగతనం చేసిన వ్యక్తి వద్ద నుండి 21.5 తులాల బంగారం, అర కిలో వెండి, 60 వేల నగదు మొత్తం కలిపి 11 లక్షల రూపాయల విలువగల సొత్తు సదరు వ్యక్తి వద్ద నుండి రికవరీ చేసుకున్నట్లు ఏసిపి రామారావు వెల్లడించారు. ఈ సందర్భంగా దొంగతనాల నివారణకు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
మీడియా సమావేశంలో ఏసిపితో పాటు రుద్రూర్ సిఐ అశోక్ రెడ్డి, వర్ని ఎస్ఐపి అనిల్ రెడ్డితో పాటు ఏఎస్ఐ బాబురావు, అనిల్, విఠల్ పాల్గొన్నారు. చోరీ కేసులను చాకచక్యంగా చేదించిన ముగ్గురు పోలీసు సిబ్బందిని అభినందించి ప్రోత్సాహకంగా నగదు బహుమతిని ఏసిపి రామారావు అందజేశారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బార్లకు భారీగా దరఖాస్తులు - March 6, 2021
- అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి - March 6, 2021
- బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు - March 6, 2021