నిజాంసాగర్, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం సాయంత్రానికి 324 క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే వస్తున్నట్లు ప్రాజెక్ట్ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1397.85 అడుగులు (9.188 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.
సింగూరు ప్రాజెక్ట్‌లోకి 682 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్ల (29.917) టీఎంసీలకు కాగా ప్రస్తుతం 522.570 మీటర్ల, (24.423) టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. సింగీతం ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో రావడం లేదన్నారు.
సింగీతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 416.550 మీటర్ల గాను 416.550 మీటర్ల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. కళ్యాణి ప్రాజెక్ట్‌లోకి 158 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని వరద ద్వారా వస్తున్న ఇన్ ఫ్లో ప్రధాన కాలువలోకి మళ్ళించడం జరుగుతుందని తెలిపారు. కళ్యాణి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 409.60 మీటర్ల గాను 408.60 మీటర్ల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వృద్ధురాలికి రక్తదానం - January 19, 2021
- కోవిడ్ టీకా కేంద్రాన్ని ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే - January 19, 2021
- నిధుల సద్వినియోగం, సకాలంలో పనులు – ఎంపి ధర్మపురి అర్వింద్ - January 19, 2021