కామారెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయేతర ఆస్తులకు హక్కు పత్రాలను ప్రభుత్వం ఇస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. తాడ్వాయి మండలం కష్ణాజివాడిలో ఆస్తుల నమోదు సర్వేను పరిశీలించారు. లింగంపేటలో ఆస్తుల నమోదు వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కష్ణాజివాడిలో పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించారు. మొక్కలకు పాదులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్తుల నమోదు సర్వేను గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు రోజుల్లో ...
Read More »Daily Archives: October 7, 2020
కామరెడ్డిలో అపూర్వ స్పందన
కామరెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆస్తుల నమోదు సర్వేకు జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆస్తుల నమోదుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో చేపట్టిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులకు మెరున్ పాస్ పుస్తకాలు ఇస్తోందని సూచించారు. ప్రతి గ్రామంలో ఆస్తుల నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో వార్డుల వారీగా బందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లబ్ధిదారులు ...
Read More »కామారెడ్డి జిల్లా బాధ్యులు వీరే…
కామారెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీసీ యువజన విభాగంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించిన కాముని సుదర్శన్ నేతని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా, జడల రజినీకాంత్‌ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీసీ సంక్షేమ సంఘము జాతీయ అధ్యక్షులు ఆర్.కష్ణయ్య హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో జిల్లా అధ్యక్షులుగా నియామకం పొందిన కాముని సుదర్శన్ మాట్లాడుతూ యువజన ...
Read More »అలసత్వం సహించబోము – జిల్లా కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతీ గ్రామంలో రోజుకు 50 వ్యవసాయేతర ఆస్తులను గుర్తించి ఆన్లైన్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఏపీవోలు, డిఎల్పీఓ, ఎపిఓలతో ఏర్పాటు చేసిన సెల్ కాన్పరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అప్లోడింగ్ మందకొడిగా సాగుతుందని, ఇదే విధంగా ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రోజూ 50 నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ గుర్తించి వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ ...
Read More »సర్వం సిద్ధం… వివరాలివి…
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి.నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అక్టోబర్ 9 తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని, ఉమ్మడి లోకల్ బాడీ ...
Read More »బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి
ఆర్మూర్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ వ్యతిరేకించడాన్ని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పుప్పాల శివరాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నర్సింహా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆర్మూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు బుధవారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు మేలు చేస్తుందని వారి పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని, దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ...
Read More »పరిపాలనకు గుండెకాయ వంటిది
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్పల్లి మండల కేంద్రంలోని 7 వ బెటాలియన్ లో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సిటిపిసిఎస్ / ఏఆర్ కానిస్టేబుల్స్ దీక్షిత్ కవాత్‌కు బుధవారం ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9 నెలల శిక్షణ పూర్తిచేసుకుని ఉద్యోగంలో చేరినందుకు, కరోనా పీరియడ్‌లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్కరికి కూడా కరోనా వల్ల ఇబ్బంది రాకుండా శిక్షణ పూర్తి చేసుకున్నందుకు 347 మంది మెంబర్లకు హదయ ...
Read More »8 నుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళన
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు అనుబంధం) రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశం బుధవారం యూనియన్ కార్యాలయం కోటగల్లీలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఐ.ఎఫ్.టి.యు జాతీయ ఉపాధ్యక్షులు డి.వి కష్ణ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పని చేస్తున్న బీడీ కార్మికులు, టేకేదార్లు, ప్యాకర్స్ బట్టివాలా తదితరుల వేతనాలు, కూలీ రేట్లు పెంచాల్సి ఉన్నా, యాజమాన్యాలు స్పందించకపోవడం సరైంది కాదన్నారు. అదేవిధంగా బీడీ కార్మికులకు సరిపడా పనిదినాలు కల్పించడం, ఆకు, ...
Read More »కోతలు మొదలైనయి.. కొనుగోలెప్పుడు
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో రైతులు కష్టపడి పండించిన పంటలు కోతకు వచ్చాయి. ప్రభుత్వం దష్టి సారించి కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కాలయాపన చేయొద్దు అని, దళారులు కొన్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులు నష్టపోతారని, దళారులకే లాభం చేకూరుతుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూనీపూర్ రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరానికి సుమారు 28 వేల రూపాయల నుండి 30 ...
Read More »దళారులను నమ్మి మోసపోవద్దు
బీర్కూర్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్టించి పండించిన రైతు తమ పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్, పిఏసిసి మైలారం కమిటీ ఛైర్మన్ పెరక శ్రీనివాస్ ఒక ప్రకటనలో అన్నారు. సిఎం కెసిఆర్ కృషితో, అలాగే శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కృషితో త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను నసురుల్లాబాద్ మండలంలో ఏర్పాటు చేస్తున్నామని వాటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ రైతులను కోరారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ...
Read More »