Breaking News

బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ వ్యతిరేకించడాన్ని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పుప్పాల శివరాజ్‌ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నర్సింహా రెడ్డి అన్నారు.

ఈ మేరకు ఆర్మూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు బుధవారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు మేలు చేస్తుందని వారి పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని, దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని స్పష్టం చేశారు. రైతులు కట్టాల్సిన టాక్సులు చెక్‌ పోస్ట్‌లు రుసుములు రద్దు అవుతాయని అన్నారు. రైతులు తాము పండించిన పంటను తామే స్వేఛగాే అమ్ముకోవచ్చని తెలిపారు.

కాంగ్రెస్‌ 40 సంవత్సరాల కింద ప్రవేశపెట్టిన ఏపీఎంసి చట్టం చాలా దారుణంగా ఉందని రైతులు పండించిన పంటను వారే విక్రయించాలని బయట విక్రయించ రాదని, రైతులకు నష్టం చేకూర్చే విధంగా దళారులను ఏర్పాటు చేసి వాళ్లే కొనుగోలు చేసి అధికార పార్టీలు పబ్బం గడుపుతున్నారని, దీని వల్ల రైతులకు నష్టం చేకూరుతుందనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్రమోడీ మూడు బిల్లులను ప్రవేశపెట్టారని వివరించారు.

ఇప్పటికైనా వామపక్షాలు రైతులకు వారి స్వార్ధం కొరకు ఆందోళనలు చేస్తే రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా రైతులు మోడీ పక్షాన నిలిచి అనవసర మాటలు నమ్మక బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. అలాగే బిజెపి కార్యకర్తలు గ్రామగ్రామాన వెళ్లి వ్యవసాయ బిల్లుపై అవగాహన కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, మాజీ ఫ్లోర్‌ లీడర్‌, భాజపా నాయకులు మురళి, సుంకరి రమణ పాల్గొన్నారు.

Check Also

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న ...

Comment on the article