Breaking News

Daily Archives: October 8, 2020

ప్రలోభాలకు గురికావద్దు… చట్టం ముందు అందరూ సమానమే…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జాన్కంపేట్‌లోని కమిషనరేట్‌ శిక్షణ కేంద్రంలో సైబరాబాద్‌ నుండి సివిల్‌ కేటగిరిలో కానిస్టేబుల్‌గా ఎంపిక కాబడిన స్టైపండరి క్యాడేట్‌ ట్రైని కానిస్టేబుల్స్‌కు తొమ్మిది నెలల పాటు శిక్షణ అందించారు. ముగింపు కార్యక్రమంలో 258 మందికి గురువారం పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పాల్గొన్నారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుండి పోలీస్‌ కమిషనర్‌ గౌరవ వందనం స్వీకరించిన ...

Read More »

అర్హత గలవారికి రుణాలు ఇప్పించాలి

కామరెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల వీధి వ్యాపారులకు రుణాలను ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మునిసిపల్‌, మెప్మా అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కార్యాలయంలో కోవిడ్‌ రుణాల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రుణాలు ఇప్పించడంలో అధికారులు పురోగతిని సాధించాలని పేర్కొన్నారు. బ్యాంకుల వారిగా లక్ష్యాలను అధిగమించాలని బ్యాంకర్లకు సూచించారు. మూడు రోజుల్లో రుణాలను లబ్ధిదారులకు అందించాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ ...

Read More »

10 లోగా నమోదు పూర్తికావాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయేతర భూములకు ప్రభుత్వం హక్కు పత్రాలను ఇస్తుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో ఆస్తుల నమోదు సర్వే పై సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 10లోగా ఆన్‌లైన్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేయడం పూర్తి కావాలని పేర్కొన్నారు. సర్వే వివరాలు నమోదు చేయడంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయేతర భూములకు ...

Read More »

రాష్ట్రంలో కామారెడ్డి మొదటి స్థానం

కామరెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు జిల్లాలో వందశాతం పూర్తయి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినందున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పంచాయతీరాజ్‌ ఇంజనీర్లను, అధికారులను అభినందించారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా పంచాయతీ రాజ్‌, ట్రాన్స్కో, వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ విషయం తెలిపారు. రైతు వేదిక భవనాల చుట్టూ రెండు వరుసలలో పెద్ద మొక్కలు నాటాలని, ...

Read More »

అంబులెన్సులో ప్రసవం

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం పెద్ద గుజ్జుల్‌ తండా గ్రామానికి చెందిన, బానోత్‌ లావణ్య, 21 సంవత్సరాలు, ఆమెకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని, లావణ్యను హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. పురిటి నొప్పులు అధికం అవడంతో, బిడ్డ మెడచుట్టు బొడ్డు తాడు చుట్టుకొని ఉండడంతో, సిబ్బంది కష్టపడి, మార్గమధ్యలో మొడెగమ వద్ద అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు. మొదటి ప్రసవం కావడంతో ...

Read More »

నిబంధనలు పాటించాలి

కామరెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. కోవిడ్‌ నిబంధనలు ఓటర్లు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »

ఎన్నికల నిబంధనలతో పాటు కోవిడ్‌ నిబంధనలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లు పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్‌ వీరబ్రహ్మయ్య, ఐఏఎస్‌ మరియు జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి. గురువారం స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల మెటీరియల్‌, మెన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ ప్రిసైడింగ్‌ అధికారులతో మాట్లాడారు. మెటీరియల్‌ ఏమీ మిస్‌ కాకుండా చూసుకోవాలని, ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఎన్నికల నిబంధనలతో పాటుగా కోవిడ్‌కు సంబంధించిన ...

Read More »

మూల్యాంకనం ప్రారంభం

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గురువారం ఉదయం డిగ్రీ మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మొదటగా కెమిస్ట్రీ, కామర్స్‌, ఇండియన్‌ ఎకనామిక్స్‌ సబ్జెక్ట్‌లలో మూల్యాంకనం ప్రారంభించామన్నారు. సైన్స్‌ కోర్సులకు డా. బాలకిషన్‌, జవేరియాబీ కామర్స్‌కు డా. జి. రాంబాబు, ఎకనామిక్స్‌కు టి. సంపత్‌ కో -ఆర్డినేటర్స్‌గా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ జరుగుతున్న పరిసర ప్రదేశాలలో శానిటైజేషన్‌ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్జామినర్లకు కంట్రోలర్‌ కోవిద్‌ ...

Read More »

వేతనాలు పెంచాలంటూ పలుచోట్ల ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కంపనీలలో బీడీలు చేసే బీడీ కార్మికులకు, ఫ్యాకర్లకు, నెలసరి ఉద్యోగులకు, బట్టీవాలలకు వేతనాలు 50 శాతం పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ధర్నా నుద్దేషించి యూనియన్‌ జిల్లా అద్యక్షుడు డి.రాజేశ్వర్‌ మాట్లాడుతూ కార్మికుల వేతన అగ్రిమెంట్‌ 2020 మే నెలతో ముగిసినదని, నూతన అగ్రిమెంట్‌ కోసం ఏప్రిల్‌ నెలలో డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చామని బీడీ యాజమానులు చర్చలకు ...

Read More »

టియులో కోవిడ్‌ ప్రతిజ్ఞ

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో గురువారం కొవిద్‌ – 19 అవగాహనా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం మధ్యాహ్నం 1 గంటలకు విశ్వవిద్యాలయ సిబ్బంది అందరి చేత కొవిద్‌ – 19 కి సంబంధించిన అవగాహనా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరు కొవిద్‌ -19 నిబంధనలు విధిగా పాటించాలని రిజిస్ట్రార్‌ ప్రతిజ్ఞ ద్వారా సూచించారు. ప్రతిజ్ఞ సారాంశం అన్ని సమయాలలో ...

Read More »

మహిళకు రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సౌమ్య 25 సంవత్సరాల మహిళకు జీవదాన్‌ వైద్యశాలలో గర్బసంచి ఆపరేషన్‌ నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలుని సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన సురేష్‌ సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడినట్టు బాలు పేర్కొన్నారు. పదివేల మందిలో కేవలం మూడు వందల మందికి మాత్రమే బి నెగిటివ్‌ రక్తం ఉంటుందని అత్యవసరంగా రక్తం కావలసి ఉన్నదని ...

Read More »