Breaking News

టియులో కోవిడ్‌ ప్రతిజ్ఞ

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో గురువారం కొవిద్‌ – 19 అవగాహనా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం మధ్యాహ్నం 1 గంటలకు విశ్వవిద్యాలయ సిబ్బంది అందరి చేత కొవిద్‌ – 19 కి సంబంధించిన అవగాహనా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరు కొవిద్‌ -19 నిబంధనలు విధిగా పాటించాలని రిజిస్ట్రార్‌ ప్రతిజ్ఞ ద్వారా సూచించారు.

ప్రతిజ్ఞ సారాంశం

అన్ని సమయాలలో నేను మరియు మా యూనివర్సిటి సిబ్బంది కరోనా బారిన పడకుండా కోవిద్‌ -19 మార్గనిర్దేశాలకు నిబద్ధుడినై ఉంటాను.

కరోనా వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తగు జాగ్రతలు తీసుకుంటాను.

అందరికి కోవిద్‌ -19 పట్ల అవగాహన కలిగేటట్లు వ్యవహరిస్తాను.

అందుకోసం జనసమ్మర్దం గల ప్రదేశాలలో ఎల్లప్పుడు మాస్కు ధరిస్తాను.

కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తాను.

తరుచుగా చేతులను సబ్బుతో కడుకుంటాను.

అందరితో కలిసి కోవిద్‌ – 19 మీద పోరాడి విజయం సాధిస్తాను.

కార్యక్రమంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డా. పాత నాగరాజు, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డా. బాలకిషన్‌, ఆర్‌టిఐ సెల్‌ ఆఫీసర్‌ డా. జవేరియా, ఎన్‌ఎస్‌ఎస్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌ తదితర పరిపాలనా భవన సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

సుజాత్‌ అలీకి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగపు పరిశోధక విద్యార్థి, ...

Comment on the article