కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని టిజివిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్ కార్ రామకష్ణ అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ద విద్యార్థుల మీద లేదని అభివద్ధిలో దేశానికే ఆదర్శమని చెప్పుకునే తెరాస ప్రభుత్వం ఎంసెట్ ఫలితాల గందరగోళంపై నోరుమెదపకపోవడం సిగ్గు మాలిన చర్య అని, పరీక్షకు హాజరు కాని ...
Read More »Daily Archives: October 10, 2020
ఉపసంహరించే వరకు ఉద్యమిద్దాం
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకునే వరకు రైతులంత ఐఖ్యమత్యం తో పోరాడాలని ఏఐకేఏంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ రైతాంగానికి పిలుపు నిచ్చారు. శనివారం రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో రైతులతో జరిగిన సమావేశం లో వి.ప్రభాకర్ మాట్లాడారు. బిల్లులతో రైతులకు నష్టం జరుగదని మోసగించే మాటలు చెప్పుతుండని మండిపడ్డారు. బిల్లులు బడా కార్పొరేట్ కంపనీలకు ఉపయోగపడేయేనన్నారు. 2006 లో రైతాంగానికి నష్టాల పాలు కాకుండా ...
Read More »‘లా’ పరీక్షల షెడ్యూల్ విడుదల
డిచ్పల్లి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్ఎల్ఎం నాల్గవ (చివరి) సెమిస్టర్, ఎల్ఎల్బి ఆరవ (చివరి) సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు మరియు ఎల్ఎల్బి రెండవ, నాల్గవ సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు ఈ నెల 14 నుంచి 22 వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు. ఉదయం ఎల్ఎల్బి ...
Read More »చాలా రోజుల తర్వాత స్వామి వారి దర్శనం
భీమ్‌గల్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబచాల క్షేత్రం 10 వతేదీ శనివారం ఉదయం 9 గంటలకి పున: ప్రారంభం అయింది. చాలా రోజుల తర్వాత దేవస్థానం తెరుచుకోవటంతో భక్తుల తాకిడి పేరుగనుంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 9 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్థానం వారు సానిటైజర్ మరియు సామాజిక ...
Read More »ప్రాణాలు కాపాడిన యువకుడు
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వర్ష వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై మల్లయ్యకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యులు కిరణ్ కుమార్‌ను సంప్రదించారు. రక్తదాత సంతోష్ రెడ్డి సహకారంతో బి పాజిటివ్ రక్తం అందించి ప్రాణాలు కాపాడినట్లు నిర్వాహకులు బాలు తెలిపారు. గతంలో చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితులలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించిన కిరణ్‌ను, రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ ఏసుగౌడ్, ...
Read More »తండ్రి చనిపోతే వారసుల పేరిట నమోదు చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయేతర ఆస్తుల నమోదులో పురోగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ ఎ. శరత్ అన్నారు. శనివారం అధికారులతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల వారిగా ఆస్తుల వివరాలు ఆన్లైన్ చేయాలని సూచించారు. ప్రతి హ్యాబిటేషన్‌లో ఆస్తుల నమోదు 100 శాతం జరిగే విధంగా చూడాలని కోరారు. ఆదివారం ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఉండి సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. తండ్రి మతి చెందితే ఆయన ఆస్తిని వారసుల పేరిట ...
Read More »12న ఉదయం 8 గంటలకు…
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి స్క్రూటినీ నిర్వహించిన ఎన్నికల అబ్జర్వర్ వీరబ్రహ్మయ్య, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి నారాయణ రెడ్డి. శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కళాశాలలోని కౌంటింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్కూటీని ప్రక్రియలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్, జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్ట్స్‌ను రాండంగా పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ...
Read More »ప్రారంభానికి సిద్ధం చేయండి
బాన్సువాడ, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో నిర్మిస్తున్న 50 రెండు పడక గదుల ఇండ్లు పూర్తయిన సందర్భంగా వాటిని నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి శనివారం పరిశీలించారు. మిగిలిన చిన్న చిన్న పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కాంట్రాక్టర్ కు ఫోన్లో మాట్లాడి సూచించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ యం. నారాయణ్ రెడ్డి, గ్రామ రైతు బంధు అధ్యక్షులు డి. నారాయణరెడ్డి, మండల నాయకులు దొడ్ల ...
Read More »ఇద్దరు డిబార్
డిచ్పల్లి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ కోర్సులకు చెందిన బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ(ఎల్) చివరి (ఆరవ) సెమిస్టర్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు జరిగిన మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 1389 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 1291 హాజరు, 98 గైరాజరు అయినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం ...
Read More »