Breaking News

ప్రారంభానికి సిద్ధం చేయండి

బాన్సువాడ, అక్టోబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామంలో నిర్మిస్తున్న 50 రెండు పడక గదుల ఇండ్లు పూర్తయిన సందర్భంగా వాటిని నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. మిగిలిన చిన్న చిన్న పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కాంట్రాక్టర్‌ కు ఫోన్లో మాట్లాడి సూచించారు.

ఆయన వెంట గ్రామ సర్పంచ్‌ యం. నారాయణ్‌ రెడ్డి, గ్రామ రైతు బంధు అధ్యక్షులు డి. నారాయణరెడ్డి, మండల నాయకులు దొడ్ల వెంకట రామ్‌ రెడ్డి, మండల తెరాస పార్టీ అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, సొసైటీ డైరెక్టర్‌ సాయి రెడ్డి, సాయిలు, మాజీ డైరెక్టర్‌ సాయిలు, వసి మరియు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య ...

Comment on the article