Breaking News

అమ్మాయిలను వివక్షతతో చూడరాదు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మాయిలను వివక్షతతో చూడరాదని అడిషనల్‌ కలెక్టర్‌ బి.లత అన్నారు. ఆదివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వాలు అమ్మాయిల ఎదుగుదల కొరకు, చదువు కొరకు, అన్ని రంగాల్లో రాణించడానికి కషి చేస్తున్నాయని, అమ్మాయిలకు వారి తల్లిదండ్రులు అన్ని విధాలుగా తోడ్పాటు అందించాలని సూచించారు.

అమ్మాయిలను వివక్షతతో చూడకూడదని, అబ్బాయిలకు అమ్మాయిలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. అధునాతన యుగంలో అమ్మాయిలు అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు. అమ్మాయిలు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మరియు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు సన్మానం చేశారు.

జిల్లాలో ఉన్న సూపర్‌వైజర్లకు బేటి బచావో బేటి పడావో అవగాహన మరియు ప్రచార కర్తగా ఉండాలని కోరారు. అనంతరం లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం మరియు పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఝాన్సీ లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, సిడిపివోలు సౌందర్య, సుధారాణి, వినోద, డీసీపీఓ చైతన్య, మంజుల మరియు ఐసిపిఎస్‌, సఖి, చైల్డ్‌ లైన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

Comment on the article