Breaking News

స్క్రూటినీ జాగ్రత్తగా చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌లో పాల్గొనే అధికారుల శిక్షణలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ మరియు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి నారాయణ రెడ్డి. ఆదివారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ హాజరై పలు సూచనలు చేశారు.

స్క్రూటినీ జాగ్రత్తగా చేయాలని, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు ఎన్నికల సంఘం జారీచేసిన నియమనిబంధనల విషయంలో క్లారిటీతో ఉండాలని, ఎటువంటి సందేహాలున్నా తమతో సంప్రదించి నివత్తి చేసుకోవాలని, నిబంధనల కనుగుణంగా కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.

అనంతరం కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డిఓలు రవి, రాజేశ్వర్‌, ఏవో సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

Comment on the article