Breaking News

ఘన విజయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. సోమవారం స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపుతో పూర్తయింది. మొత్తం ఓట్లు 824, కాగా పోలైన ఓట్లు 823. అయితే టిఆర్‌ఎస్‌ 728, బీజేపీ 56, కాంగ్రెస్‌ 29, చెల్లని ఓట్లు 10 గా ఎన్నికల అధికారులు వివరాలు వెల్లడించారు.

అనంతరం జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి కవితకు దృవీకరణ పత్రం అందజేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

Check Also

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

Comment on the article