వర్ని, అక్టోబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీడీ కంపనిలలో పని చేస్తున్న బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, చాటర్స్, నెలసరి ఉద్యోగులకు, బట్టీ వాలాలకు 50 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చందూర్ మండల కేంద్రంలో సాబ్లే వాఘ్రే బీడీ సెంటర్లో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
సెంటర్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ కార్మికుల పాత అగ్రిమెంట్ మే నెలతో పూర్తయిందని, జూన్ 1వ తేదీ నుంచి కొత్త అగ్రిమెంట్ చేసుకొని కార్మికుల కూలీ రేట్లు పెంచి ఇవ్వాల్సి వుండగా బీడీ యాజమానులు చర్చలకు రాక పోవడం మూలంగా వేతనాలు పెంచనందున, మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోయి, కార్మికులు వాటిని కొనుగోలు చేయలేక, కుటుంబాల పోషణ కోసం అనేక ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే బీడీ యాజమానులు చర్చలకు వచ్చి కూలీ రేట్లు పెంచివ్వాలని, ఇతర సమస్యలను కూడ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు కే.రవి, కె.వైద్యనాత్, నెలసరి ఉద్యోగులు డి.నర్సింలు, కె. జయ, టి.లక్ష్మీ, రాజమని, సంజయ్, ప్యాకర్స్ ఉషారాణి, జ్యోతి, సౌందర్య, భారతి, విజయ, అబి, అనిత, రేఖ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…? - February 25, 2021
- వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత - February 25, 2021
- 26లోగా పూర్తి చేయాలి - February 24, 2021