Breaking News

భక్తులకు విజ్ఞప్తి…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లాలోని తుల్జాపూర్‌ భవానీ మాత అమ్మవారి గుడిలో దసరా నవరాత్రులు ఈ నెల 17వ తేదీ నుండి నవంబర్‌ 1 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తుల్జా భవానీ టెంఫుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మరియు ఉస్మానాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నవరాత్రుల సందర్బంగా ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలనుండి అమ్మవారి దర్శనానికి వస్తుంటారని, కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం నవరాత్రి వేడుకలు పూజారులు, మహంతుల సమక్షంలో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సంవత్సరం నవరాత్రుల సందర్బంగా ఎవరినీ తుల్జాపూర్‌లోకి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. కావున నిజామాబాద్‌ జిల్లా భక్తులెవరూ నవరాత్రుల సందర్భంగా తుల్జాపూర్‌ భావానీమాత ఆలయానికి వెళ్లరాదని, నవరాత్రి ఉత్సవాలను వెబ్‌సైట్‌లో తిలకించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Check Also

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

Comment on the article