Breaking News

నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌కి గోల్డ్‌ మెడల్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహదయుడు, సజ్జనుడు, స్నేహశీలి, గాయకుడు, సంగీతాభిమాని, మదుభాషి అన్నిటికీ మించి మానవత్వమున్న మంచిమనిషి డాక్టర్‌ నీలి రామచందర్‌, గౌరవ చైర్మన్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి, నిజామాబాద్‌ జిల్లా శాఖకి 2017-18 సంవత్సరానికి గాను, ఆయన రెండు దశాబ్దాలుగా చేపట్టిన సేవా కార్యక్రమాలకు గాను ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి, నేషనల్‌ హెడ్‌ క్వార్టర్‌ వారిచే జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్స్‌ గోల్డ్‌ మెడల్‌ ఇవ్వడం ఎంతగానో సంతోషకరమని జిల్లా పాలనాధికారి మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా అధ్యక్షులు సి నారాయణ రెడ్డి అభినందనలు తెలిపి, పుష్ప గుచ్చం అందచేసి, శుభాకాంక్షలు తెలిపారు.

బంగారు పతకం జాతీయ స్థాయిలో జరిగే రెడ్‌ క్రాస్‌ వార్షిక వేడుకలో భారత రాష్ట్రపతి 15 వ తారీఖున ప్రదానం చేయనున్నారని జిల్లా సెక్రటరీ బుస్స ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్‌, కోశాధికారి కరిపే రవీందర్‌ పాల్గొన్నారు.

Check Also

స్పందించకపోవడం సరికాదు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని వివిద బీడీ కంపనీలలో బీడీలు చేసే కార్మికులతో ...

Comment on the article