Breaking News

వర్షానికి ట్రీగార్డులు పడిపోయాయి – సరిచేయించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దసరాకు రైతు వేదికలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా రైతు వేదికలు, పల్లె ప్రకతి వనాలు, గ్రామ పంచాయతీ నర్సరీలు, హరితహారం, హౌస్‌ హోల్డ్‌ సర్వేపై డివిజన్‌ మరియు మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హరితహారం, శానిటేషన్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లో లేబర్‌ మెయింటెనేన్స్‌ 12 శాతం ఉందని ఇంకా పెంచాలన్నారు.

ఏవిన్యూ ప్లాంటేషన్‌ ఆడిట్‌ చేయటానికి వచ్చేనెల 3,4,5 తేదీలలో జిల్లాస్థాయి అధికారులను 20 కిలోమీటర్లకు ఒకరు చొప్పున పంపడం జరుగుతుందన్నారు. రైతు వేదికలు ఈనెల 20వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. దసరాకు అన్ని రైతు వేదికలు ప్రారంభించుకోవాలని, పంచాయతీ రాజ్‌ ఏఈ ఇచ్చిన ప్లాన్‌ ప్రకారం పని జరగాలన్నారు. ప్లాన్‌ ప్రకారం జరగకుంటే వెంటనే తమ దష్టికి తేవాలన్నారు.

పల్లె ప్రకతి వనాలు ఈనెల 20వ తేదీ వరకు పూర్తి కావాలన్నారు. ప్లాంటేషన్‌ అర ఎకరాకు రెండు వేల మొక్కలు, ఎకరాకు నాలుగు వేల మొక్కలు తప్పనిసరి ఉండాలన్నారు. పల్లె ప్రకతి వనాలకు స్థలాలు ఎమ్మార్వో గుర్తించి ఇవ్వాలన్నారు. పల్లె ప్రకతి వనాలు ప్రతి హ్యాబిటేషన్‌లో ఉండాలన్నారు. డెన్స్‌ ప్లాంటేషన్‌ జరగాలన్నారు. శానిటేషన్‌ యాప్‌ దసరా తర్వాత ఇంప్లిమెంట్‌ చేస్తామన్నారు.

ఏవెన్యూ ప్లాంటేషన్‌ ట్రీ గార్డ్స్‌ వర్షానికి అన్ని పడిపోయాయని వాటిని వన సేవకులతో ప్రాపర్‌గా సరి చేయించాలని, ఆడిట్‌కు వెళ్లిన అధికారులు ప్రతి ఐదు మీటర్లకు ఒక మొక్క ఉండే విధంగా పరిశీలించాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో అడిషనల్‌ కలెక్టర్లు లత, చంద్రశేఖర్‌, డిఆర్డిఓ శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్పందించకపోవడం సరికాదు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని వివిద బీడీ కంపనీలలో బీడీలు చేసే కార్మికులతో ...

Comment on the article