నిజామాబాద్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని వివిద బీడీ కంపనీలలో బీడీలు చేసే కార్మికులతో పాటు ప్యాకర్లకు, చాటర్స్, నౌకర్ స్టాఫ్, గంపావాల, నెలసరి ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యల పరిష్కారానికై ఎడపల్లి మండల కేంద్రంలో గల కోమ్డాచాఫ్ బీడీ సెంటర్ ముందు తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్స్, బట్టీ వాలాలతో ధర్నా నిర్వహించి, మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా యూనియన్ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్ మాట్లాడుతూ బీడీ కార్మికుల వేతనాలకు సంబందించిన పాత అగ్రిమెంట్ మే నెలతో ముగిసినందున కొత్త అగ్రిమెంట్ చేసి కూలీ లు పెంచివ్వాలని, ఏప్రిల్ నెలలోనే డిమాండ్ నోటీస్ ఇచ్చామని బీడీ యాజమానులు చర్చలకు రాకపోవడంతో సెప్టెంబర్ నెల 12 నాడు మరో సారి వినతిపత్రాన్ని ఇచ్చామని అయినా బీడీ యాజమానుల అసోసియేషన్ తరుపున స్పందించ పోవడం సరి కాదన్నారు.
కరువు భత్యం 1 పాయింటుకు 30 పైసలు ఇవ్వాల్సి వుండగా 10 పైసలు మాత్రమే చెల్లిస్తూ కార్మికులకు నష్ట పరుస్తున్నారని మండిపడ్డారు. లాక్ డౌన్ సమయంలో అడ్వానుగా ఇచ్చిన వాటిని జీతాల్లో కట్ చేస్తున్నారని, వాటిని వెంటనే ఆపి వేయాలన్నారు.
ఇప్పటికైనా చర్చలకు వచ్చి వేతనాలు పెంచి ఇతర సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐకేఏంఎస్ జిల్లా నాయకులు గుమ్ముల గంగాధర్, బీడీ ప్యాకర్స్ రబ్బాని పటేల్, రవి, లింగం, బీడీ కార్మికులు లింగుభాయి, అబ్బవ్వ, లక్ష్మీ, గంగామని, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021